హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్రపూజల కలకలం.. ఎందుకోసం ఇదంతా ?
స్కూల్ లో క్షుద్రపూజలు జరిగిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా..
ఇటీవల కాలంలో జనావాసాల మధ్య, ఆలయాలు, పురాతన భవనాల వద్ద కొందరు అక్రమార్కులు క్షుద్రపూజల పేరుతో ప్రజలను భయపెడుతున్నారు. తమకు కావాల్సిన దానికోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది. స్కూల్లోని సైన్స్ ల్యాబ్ తో పాటు స్టోర్ రూమ్ లోనూ క్షుద్రపూజలు చేసినట్లు తెలుస్తోంది.
స్కూల్ లో క్షుద్రపూజలు జరిగిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా ఎవరు చేశారని తెలుసుకునేందుకు సీసీటీవీలను పరిశీలిద్దామని చూస్తే.. అవి కూడా మాయమయ్యాయి. దాంతో ఈ క్షుద్రపూజలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈజీ మనీ కోసం ఇదంతా చేశారా ? దీని వెనుక ఎవరున్నారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.