తెలంగాణలో నేటి నుంచి బూస్టర్ డోస్
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు నేటి నుంచి తెలంగాణలో బూస్టర్ డోస్ ను అందివ్వనున్నారు
ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంది. ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు కూడా రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. గతంలో వందకు మించని కేసులు నేడు మూడు వేలకు దరిదాపుల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
తొలి రెండు డోసులు....్
దీంతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు నేటి నుంచి తెలంగాణలో బూస్టర్ డోస్ ను అందివ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిందరికీ బూస్టర్ డోస్ ను నేటి నుంచి ఇవ్వనున్నారు. అలాగే హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కూడా నేటి నుంచి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. తొలి రెండు డోసులు తీసుకున్న వ్యాక్సిన్ ను మాత్రమే బూస్టర్ డోస్ గా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.