KCR : కేసీఆర్ పర్యటనకు రోడ్ మ్యాప్ రెడీ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమయిన ఆయన అభ్యర్థులకు బీఫారాలను అందచేశారు. అనంతరం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ప్రతిరోజూ పొలంబాట...
దీంతో పాటు కేసీఆర్ పర్యటన కూడా ఈసారి విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తొలుత ఎండిన పంట పొలాల పరిశీలన చేయనున్నారు. అనంతరం రోడ్డు షోల్లో పాల్గొననున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 వరకు కేసీఆర్. పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం నుంచి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు, మూడు ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.