KCR : నేడు కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్

కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

Update: 2023-10-30 04:36 GMT

కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వద సభలను నిర్వహిస్తూ కేసీఆర్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఆయన విరుచుకుపడుతున్నారు. వాటి అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ఆశీర్వాద సభల్లో...
నేడు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసగించనున్నారు. అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగే సభలోనూ ఆయన మాట్లాడనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి మూడు ప్రాంతాలకు వెళ్లి అక్కడ సభల్లో పాల్గొంటారు.


Tags:    

Similar News