BRS : నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి

Update: 2024-04-27 02:31 GMT

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 వ ఏట అడుగుపెడుతున్న సమయంలో అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ను దృష్టిలో పెట్టుకుని పండగ చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

పార్టీ కార్యాలయాలలో...
బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లవుతున్న సందర్భంగా వేడుకలను ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరారు.


Tags:    

Similar News