మళ్ళీ వచ్చేది BRS ప్రభుత్వమే! ఎన్నికల ప్రచారానికి కేసిఆర్ శ్రీకారం!

రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.

Update: 2023-08-20 16:05 GMT

మళ్ళీ వచ్చేది BRS ప్రభుత్వమే!

ఎన్నికల ప్రచారానికి కేసిఆర్ శ్రీకారం!

SK.ZAKEER

రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు తమ పార్టీ గెలుస్తుందన్నారు.సూర్యాపేట నుంచి బిఆరెస్ ఎన్నికల ప్రచారాన్ని కేసిఆర్ ఆదివారం ప్రారంభించారు.కాంగ్రెస్ టార్గెట్ గా కేసిఆర్ ప్రసంగం సాగింది.

మంత్రి జగదీష్ రెడ్డి తనతో కొట్లాడి జిల్లాలో 35 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారని తెలిపారు.అరచేతిలో వైకుంఠం చూపే ప్రతిపక్షాలను నమ్మొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

35 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం BRS ప్రభుత్వమనీ కేసిఆర్ అన్నారు. తెలంగాణ రైతులు

మూడు కోట్ల టన్నుల పంటలు పండిస్తున్నారని చెప్పారు. సూర్యపేటలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయం,మెడికల్ కాలేజీ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లను ముఖ్య మంత్రి ప్రారంభించారు.సూర్యపేట జిల్లా ప్రగతి చూస్తుంటే ఆనందం గా ఉందన్నారు.సూర్యపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీ లకు 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు బహిరగసభలో ప్రకటించారు.సూర్యపేట మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేశారు.రైతు రుణమాఫీపై జగదీష్ రెడ్డి పట్టుబట్టి పోరాడారని గర్తు చేశారు.

సూర్యపే లో ఆర్ అండ్ గెస్ట్ హౌస్,

కళా భారతి నిర్మిస్తామని తెలిపారు.

జగదీష్ రెడ్డిని గెలిపిస్తే సూర్యపేట జిల్లాగా ఏర్పాటు చేస్తా అని చేసిన హామీని, ఆయనను మంత్రిగా కూడా చేస్తా అన్న హామీని నిలబెట్టుకున్నట్టు కేసిఆర్ తెలిపారు తెలంగాణలో

అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.

కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు అభివృద్ధిపై అవగాహన లేదన్నారు.

కాంగ్రెస్ వల్ల కు ఓటేస్తే ఉన్నది పోద్ది,ఉంచుకున్నది పోద్దని హేళన చేశారు.వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.తుంగతుర్తి ,

సూర్యపేటలలో సాగు నీళ్లు ఎట్లా వస్తున్నాయో మిరే చూస్తున్నారని ప్రజలకు చెప్పారు. కాంగ్రెసు పాలిత

కర్ణాటకలో కూడా కరంట్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ కాంగ్రెసు నాయకుల్లో

ఒకడు 3 గంటలు కరంట్ చాలు అని అంటాడు.వీళ్ళను నమ్మల్న? అని కోరారు. ధరణి వచ్చిన తర్వాత వ్యవసాయ స్థలాల క్రయ విక్రయాలు అత్యంత పారదర్శకంగా మారిందన్నారు.అలాంటి ధరణి ని రద్దు చేస్తా అంటున్నారని విమర్శలు గుప్పించారు.

"ఎక్కడ అవినీతి లేదు. ధరణి తీసేస్తా అనేటోళ్లను గంగలో కలపాలి. ఓట్లు వచ్చినప్పుడు ఆగం కావొద్దు.ధరణి తెచ్చి అన్నదాతలకు అధికారాలను అప్పజెప్పాము.మళ్ళీ ఆ అధికారాలను గుంజుకునే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు. రైతులు జాగ్రత్తగా ఉండాలి. విచక్షణతో ఆలోచన చేయాలి.ఎన్నో పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం.అవి అన్ని మీ కళ్ళ ముందు వున్నాయి" అని కేసిఆర్ చెప్పారు.

Tags:    

Similar News