Telangana : డైవర్షన్ కోసమే కేటీఆర్ పై అక్రమ కేసు
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులను కేటీఆర్ పై పెట్టారని హరీశ్ రావు అన్నారు.;
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులను కేటీఆర్ పై పెట్టారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. రైతు బంధు సక్రమంగా ఇవ్వకపోవడంతో ప్రశ్నిస్తామని భయపడి డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి తెరతీశారని ఆయన అన్నారు. కేటీఆర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. కేవలం కుట్ర కారణంగానే అందరిపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని రేవంత్ భావిస్తున్నారని హరీశ్ రావు అన్నారు.
విచారణకు సహకరిస్తాం...
తాము విచారణకు సహకరిస్తామని హరీశ్ రావు తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. 9వ తేదీ కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళతారని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా పోకుండా అవినీతి జరిగిందని ఎలా అంటారని హరీశ్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే కేటీఆర్ ఆ ఫార్ములా ఈ రేసును తెచ్చారన్నారు. ఎన్నికేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని, తాము నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు చెప్పారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ