తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల

Update: 2023-09-12 10:26 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని అన్నారు. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే కష్టమే అని అన్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని.. అయితే ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ అయిపోతేనే తెలంగాణ ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోదీ బయపడుతున్నాడని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే..ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని.. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ కి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే అని అన్నారు.

అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందని అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా గెలుస్తామని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమేనన్నారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ గారు సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారన్నారు.


Tags:    

Similar News