రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే : హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Update: 2024-12-02 06:59 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్ డీ చేశారన్నారు. ఏడాదిపాలనలో రేవంత్ రెడ్డి ఎన్నో మాటలను మార్చారని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నకలకు ముందు రైతు బంధు ఆపింది మీరు కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొడ్డట్టమే కాకుండా ఆ నెపాన్ని తమపై నెుడుతన్నారని ఆయన అన్నారు.

కరోనా సమయంలోనూ...
కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. రైతు బంధును రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. చివరకు తెలంగాణ బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు కూడా ఇవ్వలేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాటలను ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరని హరీశ్ రావు అన్నారు.


Tags:    

Similar News