BRS : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుకోసం.. సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది;

Update: 2025-01-16 07:08 GMT

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. దీనిపై న్యాయనిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఢిల్లీలో హరీశ్ రావు...
తెలంగాణ హైకోర్టు దీనిపై నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సిద్ధమయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇక పార్టీ నుంచి వలసలను ఆపేందుకు సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. అందుకే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లి న్యాయనిపుణులతో మంతనాలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News