KTR : ఏంది భయ్.. ఈ మాటలేంది.. ఈ సమావేశాలేంది?
మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు తమ పార్టీనిదూషించడానికే అసెంబ్లీకి వచ్చినట్లుందన్నారు.
KTR :తెలంగాణ మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషించడానికే అసెంబ్లీకి వచ్చినట్లుందని అన్నారు. భాష కూడా సక్రమంగా లేదని కేటీఆర్ అన్నారు. తాము గెలిచి ఏం చేస్తామో చెప్పకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ప్రత్యర్థి పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ కేటీఆర్ మండి పడ్డారు. ముందు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, గ్యారంటీలను అమలు చేసి చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ను తిట్టడానికేనా?
అంతే తప్ప అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లే విధంగా అసెంబ్లీని నడపటం ప్రజలందరూ చూస్తున్నారన్నారు. మేడిగడ్డకు పోయి కూలిపోయిందంటూ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని బాగు చేయాలన్న స్పృహ కూడా లేదని కేటీఆర్ మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టుకున్నది బడ్జెట్ పై చర్చించేందుకు మాత్రమేనని, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడానికి కాదన్న విషయం గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.