KTR : సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం
ఈరోజు ప్రభుత్వానికి శాసనసభలో సభా హక్కుల నోటీసు ఇస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.
ఈరోజు ప్రభుత్వానికి శాసనసభలో సభా హక్కుల నోటీసు ఇస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. అప్పుల విషయంలో ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అప్పుల విషయంలో ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తుందని, ప్రజల ఆలోచనలను పక్కదారి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి ప్రసంగం...
ఆర్థిక మంత్రి ప్రసంగం వాస్తవమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నివేదిక వెల్లడించిందన్నారు. 2014 - 2015లో 72,658 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి లేక, సంక్షేమం పైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు.