BRS : అసెంబ్లీ లో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.. నినాదాలు
లగచర్ల రైతన్నలకు బేడిలు వేసిన ప్రభుత్వ వైఖరి పైన నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు
లగచర్ల రైతన్నలకు బేడిలు వేసిన ప్రభుత్వ వైఖరి పైన నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులను చేతిలోపట్టుకుని శాసనసభలోకి తీసుకుపోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పన్నెండు వందల కోట్ల రూపాయల చెల్లించారు కానీ సర్పంచ్ లు చేసిన పనులకు మాత్రం ఈ బిల్లులు చెల్లించలేదని, దీనిపై సమాధానం చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు.
అడ్డుతగలడంపై...
సర్పంచ్ లు ఆందోళనకు దిగితే వారిని అడ్డుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క గత ప్రభుత్వం సర్పంచ్ లకు బకాయీలు పెట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. హరీశ్ రావు ప్రసంగానికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్దుతగలడంతో అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు వేశారు. మొన్న రెండు రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇదేనా ట్రైనింగ్..? అంటూ ప్రశ్నించారు. సభలో తాను మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంపై హరీశ్ రావు మండిపడ్డారు.