Telangana : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

Update: 2024-12-16 01:35 GMT

telangana assembly today

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరిగి వారం రోజులకు వాయిదా పడ్డాయి. తిరిగి నేటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని అధికారులు తెలిపారు.

కీలక బిల్లులకు...
ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు మరికొన్ని బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు కొన్ని అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుందని తెలిసింది. తెలంగాణ అసెంబ్లీసమావేశాలు ప్రారంభం అవుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేస్తున్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలుచేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News