Telangana : గ్రూప్ 2 పరీక్షలు రెండో రోజు.. హాజరు ఇంత తక్కువగానా?

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ మంది పరీక్ష రాసేందుకు రాలేదు.

Update: 2024-12-16 04:29 GMT

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ మంది పరీక్ష రాసేందుకు రాలేదు. మొత్తం 783 ఉద్యోగాలకు 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. టీజీ పీఎస్సీ కూడా 1368 వరకూ పరీక్ష కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. అసలు హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకున్న వారే 74 శాతం మంది. డౌన్ లౌడ్ చేసుకున్న వారిలో కూడా ఎక్కువ మంది పరీక్షలకు హాజరు కాలేదు. తొలిరోజు పరీక్షకు 2.57,981 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో ప్రశ్నాపత్రానికి మరింత తగ్గింది.

కారణమదేనట...
2.55 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. రెండో రోజు ఈరోజు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సరిగా ప్రిపేర్ కాకపోవడంతో పరీక్షలో హాజరు శాతం తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోస్టులు తక్కువగా ఉండటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పోటీని తట్టుకోలేమని ముందుగానే భావించిన కొందరు పరీక్షలకు కూడా హాజరు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈరోజు కూడా అరగంటకు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. నిన్న కొందరిని పోలీసులు ఆలస్యంగా వచ్చిన కారణంగా అనుమతించలేదు. మరి రెండో రోజు పరీక్షకు ఎంత మంది హాజరవుతారో చూడాలి.


Tags:    

Similar News