Telangana : రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరస భేటీలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావులు కలిశారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావులు కలిశారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగానే వీరి సమావేశం జరిగినట్లు తెలిసింది. అయితే ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తొలగింపుపై వీరు మాట్లాడినట్లు తెలిసింది.
మల్లారెడ్డి కుటుంబం కూడా...
మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే తమ వైద్య కళాశాలలో సీట్లను పెంచేందుకు సహకరించాలని కోరేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిసింది. సీట్ల సంఖ్యను పెంచేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం.