కవిత ట్వీట్.. ఠాగూర్ టార్గెట్ గా

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు

Update: 2022-12-21 06:27 GMT

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆమె ట్వీట్ చేశారు. తనపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. తన నిబద్ధతను కాలమే రుజువు చేస్తుందని ఆయన అన్నారు.

కక్ష సాధింపు చర్యలే....
ఈ ఆరోపణలన్నీ బీజేపీ కక్ష సాధింపు చర్యలేనని ఆమె అభిప్రాయపడ్డారు. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వం బీఆర్ఎస్ కు భయపడే తమపై వేధింపులకు దిగుతోందని కవిత అన్నారు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తాము కేసులకు భయపడే వారం కాదని తెలిపారు.


Tags:    

Similar News