Breaking : కవిత అభ్యర్థనకు సుప్రీంకోర్టు నో

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది;

Update: 2023-03-17 06:55 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన పిటీషన్ అత్యవసరంగా విచారించాలన్న కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాము 24వ తేదీన పిటీషన్ ను విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 20 వతేదీ తమ ఎదుట హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలవడంపై కవిత అభ్యంతరం తెలుపుతూ పిటీషన్ వేశారు.

అత్యవసర విచారణకు...
ఈనెల 16వ తేదీన ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉండగా, ఆమె హాజరు కాలేదు. అయితే ఈడీ మాత్రం 20న విచారణ హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటీషన్ ను త్వరితగతిన విచారించాలన్న కల్వకుంట్ల కవిత తరుపున న్యాయవాదులు తెలపగా సుప్రీంకోర్టు మాత్రం తిరస్కరించింది. అయితే దీనిపై ఏం చేయాలన్న దానిపై కవిత మరోసారి న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.


Tags:    

Similar News