KTR : ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసుపై నేడు విచారణ
ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులోకేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది
ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్ పై విచారణ చేపట్టనున్నారు. నేటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్నగడువు ముగిసింది. హైకోర్టు గడువు ముగియడంతో పాటు కేటీఆర్ ముందస్తు బెయిల్ విషయంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తి వేయాలని ఏసీబీ అధికారులు పిటీషన్ వేయనున్నారు. ఈ ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కేటీఆర్ పై ఏ1 నిందితుడిగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈడీ నోటీసులు కూడా...
ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే ఈడీ కూడా దీనిపై నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన కేటీఆర్ ను విచారణకు హాజరు కావాలని కోరింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ అధికారి బీఎస్ఎన్ రెడ్డిని వచ్చే నెల 2,3 తేదీల్లో విచారణకు హజరు కావాలని కోరింది. మొత్తం మీద నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now