Telangana : ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ నిలువెత్తు విగ్రహం

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Update: 2024-12-30 05:08 GMT

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన దేశంలో చేపట్టిన ఆర్థికసంస్కరణల వల్లనే దేశం ఈ రకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం కోసం సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణతో మన్మోహన్ సింగ్ కు ఉన్న అనుబంధం విడదీయలేదని అన్నారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేసినప్పుడే ఆయనకు దేశం గుర్తించినట్లు అవుతుందని తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారన్న రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ సమాజం పట్ల చూపిన ప్రేమను కూడా మరువలేమన తెలిపారు. అందరికీ ఆత్మబంధువుగా నిలిచి ఈరోజు పరమ పదించిన ఆయనకు ఈ సభ ఘనంగా నివాళులర్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడంలో ఆయన చేసిన కృషి మరువలేవని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే మన్మోహన్ సింగ్ మృతికి సభలో సభ్యులు మౌనం పాటించారు.


Tags:    

Similar News