Kalvakuntla Kavitha : రేవంత్ కు కవిత పదివేల పోస్టు కార్డులు
మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్టు కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదలుపెట్టారు;

మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్టు కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యాకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్టుల కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. 10 వేల పోస్టు కార్డులను సేకరించి పంపిస్తున్నామని కల్వకుంట్ల కవత తెలిపారు. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సోనియా గాంధీకి...
లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామన్న మొదలుపెట్టిన మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్న కల్వకుంట్ల కవిత సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదన్న కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.