నేడు ఈడీ ఎదుటకు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు;

Update: 2023-03-16 03:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. ఈరోజు విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కవిత ఇప్పటికే ఈడీ విచారణపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే కవితను ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై తో కలిపి విచారణ చేస్తారని చెబుతున్నారు.

మంత్రులు కేటీఆర్....
ఈ నెల 10వ తేదీ తరహాలోనే తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై వారు చర్చించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు.


Tags:    

Similar News