మరోసారి సుప్రీంకోర్టుకు కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.;

Update: 2023-03-17 02:39 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది. తన పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరుపున న్యాయవాదులు కోరనున్నారు. నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు కవితకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరారు.

అత్యవసర విచారణ...
కానీ కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 24న విచారిస్తామని తెలిపింది. అయితే అత్యవసరంగా విచారించాలని కవిత ఈరోజు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత నిర్ణయించారు. అందుకోసమే రాత్రి న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. కవిత ఇంకా ఢిల్లీలోనే ఉండటానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.


Tags:    

Similar News