Big Breaking : బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి

బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Update: 2023-10-30 08:25 GMT

బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కత్తి దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయమయింది. వెంటనే ఆయన అనుచరులు ఆగంతకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం అందుతుంది. మెదక్ జిల్లాలోని సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక్కసారిగా దాడి చేసి...
ప్రస్తుతం గజ్వేల్ ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో రాజు అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి దిగారు. కడుపు భాగంలో గాయం కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన రాజు అనే వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశారు? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆయనను హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News