BRS : రాజ్‌భవన్ ముట్టడికి బీఆర్ఎస్‌వీ నేతలు

నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. రాజ్‌భవన్ ముట్టడికి పిలుపు నిచ్చింది.

Update: 2024-06-18 05:56 GMT

నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. రాజ్‌భవన్ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీంతో రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన విద్యార్థి సంఘ నేతలను వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నీట్ పరీక్షల్లో...
నీట్ పరీక్షల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో అనేక మంది తెలివైన విద్యార్థులు నష్టపోయారని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు ఆరోెపించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. తాము గవర్నర్ ను కలసి వినతిపత్రం ఇవ్వాలంటే పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదని అన్నారు.


Tags:    

Similar News