KTR : గుంపు మేస్త్రీ పాలనలో అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పై ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాలేమనే అలివికాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కాంగ్రెస్‌వి 420 హామీలని ఆయన ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకపోతే బట్టలిప్పి నిలబెడతామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఇంకా కేసీఆర్ పై విశ్వాసంతో ఉన్నారన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో...
పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినా పార్లమెంటు ఎన్నికల్లో విజయం తమదేనని అన్న కేసీఆర్ గుంపుమేస్త్రీ పాలనలో ప్రజలు క్యూ కడుతున్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సిగపట్లు పడుతున్నారని ఫైర్ అయ్యారు. హామీలు ఇచ్చేముందు ఆలోచించకపోతే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని తెలిపారు. ఆటోడ్రైవర్ లు కడుపు కొట్టే విధంగా వీరి చర్యలున్నాయన్న కేటీఆర్ బీజేపీ నేతలు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు. దీనిపై బహిరంగ చర్చ పెడితే తమ పార్టీ తరుపున వినోద్ కుమార్ వస్తారని చెప్పారు.