KTR : రేవంత్ రెడ్డీ.. ఇక్కడ భయపడేటోళ్లు ఎవరూ లేరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Update: 2024-03-26 12:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చని ఆయన అన్నారు. తాము పదేళ్ల కాలంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసులు పెట్టుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ తప్పిదాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదకు తెచ్చారని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల తర్వాత...
పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన గ్యాంగ్ తో కలసి బీజేపీలోకి జంప్ అవుతారని ఆయన అన్నారు. ఇది రాసిపెట్టుకోవాలంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తే తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాట వేస్తున్నాడన్నారు. తాము ఏవైనా తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని, ఇక్కడ భయపడేటోళ్లు ఎవరూ లేరని కూడా ఆయన అన్నారు. వంద రోజుల్లో ఏ ఒక్కపని చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఊగులాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News