రేవంత్ .. చిల్లర రాజకీయాలు చేయొద్దు : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ తో ములాఖత్ అయ్యారు

Update: 2024-05-08 08:08 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ తో ములాఖత్ అయ్యారు. ఆయనను పరామర్శించారు. అనంతరం జైలు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపడం అలవాటుగా రేవంత్ రెడ్డి మార్చుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే క్రిశాంక్ పెట్టిన సర్య్కులర్ నిపుణుల ముందు ఉంచడానికి రెడీనా అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

ఫేక్ అయితే...
క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ ఫేక్ అయితే శిక్ష అనుభవిస్తారని, ఏది ఫోర్జరీ,, ఏది ఒరిజనల్ అనేది తేల్చాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరు చంచల్ గూడ జైలులో ఉండారో తేలుద్దామని కేటీఆర్ అన్నారు. వెంటనే క్రిశాంక్ ను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేయని తప్పిదానికి క్రిశాంక్ ను అన్యాయంగా జైలులో పెట్టారన్నారు కేటీఆర్. ఈ పనికి వెంటనే రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ చిల్లర రాజకీయాలు చేయవద్దంటూ హెచ్చరించారు.


Tags:    

Similar News