KTR : వాళ్లను కోర్టుకు ఈడుస్తా.. కాచుకోండి ఇక

ఫోన్ ట్యాపింగ్ అంశంపై తనపై ఆరోపణలు చేసిన వారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు;

Update: 2024-04-02 05:15 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్టయ్యారు. కొందరిని కస్టడీకి తీసుకుని విచారిస్తుండగా, మరికొందరు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

న్యాయపరంగా...
అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై తనపై ఆరోపణలు చేసిన వారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తానని తెలిపారు. న్యాయపరంగా తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటానని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News