Telangana : రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
ఈ నెల 8న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
ఈ నెల 8వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజుకు నెల రోజులు కావస్తుంది. గత నెల ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు.
ఆరు గ్యారంటీలపై...
ఈ మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో మంత్రివర్గ సమావేశం. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన నాలుగు ర్యారంటీల అమలుపై చర్చించనుంది.