ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది

Update: 2022-12-03 02:29 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద కవితకు ఈ నోటీసులు జారీ అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కవిత కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

డిసెంబరు 6న విచారణ...
ఇందుకు ఎక్కడ విచారించాలో సీబీఐ అధికారులు ఆమెకే వదిలేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో సీబీఐ విచారించుకోవచ్చని కవిత తెలిపారు. దీంతో ఈ నెల 6న కవితను హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఆమెను విచారించనున్నారు. విచారణకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని మీడియాకు తెలిపారు.


Tags:    

Similar News