Telangana Elections : క్యూ కట్టిన సెలబ్రిటీలు

తెలంగాణ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో సెలబ్రిటీలు ముందున్నారు

Update: 2023-11-30 03:28 GMT

ఓటు హక్కును వినియోగించుకోవడంలో సెలబ్రిటీలు ముందున్నారు. సినీ పరిశ్రమకు చెందిన హీరోలతో పాటు అనేక మంది ఉదయాన్నే తమ కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ పోలింగ్ కేంద్రాలకు సినీ హీరులు కుటుంబ సభ్యులతో తరలి రావడంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

క్యూ లైన్‌లో ఉండి...
క్యూ లైన్ లో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు పోలింగ్ నిబంధనలను పాటిస్తూ క్యూ లైన్ లోనే నిల్చుని తమకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సినీ హీరో వెంకటేష్ కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Tags:    

Similar News