Breaking : సీఈసీ కీలక నిర్ణయం : తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది.

Update: 2023-10-11 14:48 GMT

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నలుగురు జిల్లా కలెక్టర్లతో పాటు ముగ్గురు పోలీసు కమిషనర్లు, మరికొందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌లను వెంటనే విధుల నుంచి తప్పించాలని కోరింది. ఐఏఎస్ ల స్థానంలో ముగ్గురి పేర్ల జాబితాను రేపు సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్ కు పంపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ కార్యదర్వి శ్రీనివాసరాజు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ముషారఫ్ ఆలితో పాటు తొమ్మిది జిల్లాలకు సంబంధించిన ఎస్పీలపై బదిలీ వేటు వేసింది.

ఎస్పీలు కూడా...

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మేడ్చల్ అమోయ్ కుమార్, నిర్మల్ కలెక్టర్ ను వరుణ్ రెడ్డిలపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాధ్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ సత్యనారాయణతో పాటుగా పది మంది ఎస్పీలను బదిలీ చేసింది. ఎస్పీలు రమాకుమార్, శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహబూబాబాద్ ఎస్పీ కె.నరిసింగరావు, నాగర్ కర్నూలు ఎస్పీ మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, మహబూబ్ నగర్ ఎస్పీ చంద్రమోహన్, నారాయణ్‌ఖేడ్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కరుణాకర్‌లను బదిలీ చేసింది. వెంటనే ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News