తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం క్లారిటీ

తెలంగాణలో వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.;

Update: 2021-12-01 08:22 GMT

తెలంగాణలో వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 2020-21 లో రబీ సీజన్ లో 55 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని టార్గెట్ గా నిర్ణయించామంది. అయితే అప్పుడు 61.87 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మిగులు బియ్యం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం వల్లనే టార్గెట్ కు మించి తీసుకున్నామని పార్లమెంటులో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

టార్గెట్ కు మించి....
తెలంగాణ నుంచి ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించామని చెప్పింది. ఆగస్టు 17వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించామని చెప్పింది. యాసంగి సీజన్ మొదలయ్యాకే టార్గెట్ ను నిర్ణయిస్తామని తెలిపింది. దిగుబడి అంచనాలు, మార్కెట్ మిగులు, సాగుతీరు గణాంకాలను పరిశీలించిన తర్వాత ఎంత పెంచాలన్నది నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం సమాధానంగా చెప్పింది.


Tags:    

Similar News