చంద్రయాన్-3 ల్యాండింగ్.. ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

చంద్రయాన్ ల్యాండింగ్‌‌ గురించి సర్వత్రా ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే..! ల్యాండింగ్ ను పిల్లలకు చూపించాలని

Update: 2023-08-23 01:33 GMT

చంద్రయాన్ ల్యాండింగ్‌‌ గురించి సర్వత్రా ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే..! ల్యాండింగ్ ను పిల్లలకు చూపించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటూ ఉన్నాయి. విద్యార్థులకు లైవ్‌లో చూపించాలని మొదట తెలంగాణ విద్యాశాఖ కూడా భావించింది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది. చంద్రయాన్3లోని ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై కాలుమోపనుంది. ఇస్రో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయానికి, స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి మధ్య చాలా తేడా ఉండడంతో క్క్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్కూళ్లు 4.30 గంటలకు ముగుస్తూ ఉండగా.. విద్యార్థులను 6.30 గంటల వరకు స్కూళ్లలోనే ఉంచడం సరికాదని, దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తొలుత జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం యూట్యూబ్ ద్వారా చంద్రయాన్ ల్యాండింగ్‌ను చూపించవచ్చని తెలిపింది.

తెలంగాణ విద్యా ఛానెల్స్‌ అయిన టీ శాట్‌, నిపుణలో లైవ్‌ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్‌, నిపుణ ఛానెళ్లలో లైవ్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించడం ద్వారా చరిత్ర సృష్టించడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది.


Tags:    

Similar News