ఎన్నికలో అలా చేస్తే చర్యలు తప్పవు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చీఫ్ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చీఫ్ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అక్కడ అదనపు పోలీసు బలగాలను మొహరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ 6.80 కోట్ల నగదును సీజ్ చేశామన్న వికాస్ రాజ్ 4,560 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేయదలచుకుంటే సీ విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, బయట వ్యక్తులు నియోజకవర్గంలో ఉండటానికి వీలు లేదని తెలిపారు.
రేపటితో ప్రచారానికి....
ఎలాంటి ప్రచారం చేయకూడదన్నారు. చివరకు ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని వికాస్ రాజ్ హెచ్చరించారు. ఈ నెల 3వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలంగ్ కొనసాగుతుందని, పోలింగ్ ఏజెంట్లు గంటకు ముందు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. అదనపు సిబ్బందిని కూడా ఇందుకోసం నియమించామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఉంటారన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నిలకు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు.