వారికి సుప్రీం సీజే వార్నింగ్
కొందరు కోర్టు తీర్పులపై వక్రభాష్యం చెప్పి పైశాచికానందాన్ని పొందుతున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఇటీవల కొందరు కోర్టు తీర్పులపై వక్రభాష్యం చెప్పి పైశాచికానందాన్ని పొందుతున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసిది కాదన్నారు. పరిమితులు దాటిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. న్యాయవ్యవస్థ కొన్ని పరిమితులతో పనిచేస్తుందని కొందరు గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిధులు దాటిన వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇటీవల కాలంలో ఉన్నత స్థానంలో ఉన్న వారిపై అభాండాలు వేయడం పరిపాటిగా మారిందని, ఇది దురదృష్టకరమైన పరిణామమని అన్నారు. ఈ విషయాన్ని ఆ మిత్రులు గుర్తు పెట్టుకోవాలన్నారు.
దేశానికి ఆదర్శం....
ఎన్టీఆర్ తర్వాత పెద్దస్థాయిలో న్యాయవ్యవస్థలలో సంస్కరణ ఇదేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థలో తెలంగాణ దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. తెలంగాణలో 32 కొత్త న్యాయస్థానాల ఏర్పాటును ఆయన చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ పరుగులు తీస్తుందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జడ్జిల సంఖ్యను 22 నుంచి 44కు పెంచామని చెప్పారు. త్వరలో తెలంగాణకు ఇద్దరు హైకోర్టు జడ్జిలను నియమిస్తామని ఆయన వెల్లడించారు.