ఐదు లక్షల ఎక్స్ గ్రేషియో

సికింద్రాబాద్ బోయిగూడ స్క్రాప్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2022-03-23 05:12 GMT

సికింద్రాబాద్ బోయిగూడ స్క్రాప్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియోన ప్రకటించారు. మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకరి ఆచూకీ తెలియడం లేదు.

గోదాం యజమాని అరెస్ట్...
కాగా ప్రమాదానికి కారణమయియన గోదాము యజమాని సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా స్క్రాప్ గోదామును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. సంఘటన స్థలిని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. గోదాములో ఎగ్జిట్, ఎంట్రీ ఒకటే ఉన్నాయని, ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేవని చెప్పారు. ఇలాంటి గోదాములు అనేక చోట్ల ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగిస్తామని చెప్పారు.


Tags:    

Similar News