ఫారెస్ట్ రేంజర్ కుటుంబానికి అండగా కేసీఆర్
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. యాభై లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. రిటైర్మెంట్ వయసు వరకూ కుటుంబ సభ్యులకు జీతభత్యాలను చెల్లిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగులపై దాడులను సహించబోమని ఆయన తెలిపారు.
గుత్తికోయల దాడిలో...
అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ చేసిన మొక్కలను నరుకుతుండగా దాడికి పాల్పడటంతో గాయపడిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. గుత్తికోయలు ఈ దాడి చేశారు. భద్రాద్రి జిల్లాలో చండ్రగొండ మండలం బెండలంపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించారు. దీంతో అటవీశాఖ ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.