ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్
తెలంగాణ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అటు పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టారు. నోటిఫికేషన్ వెలువడే లోపు అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో వరస నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక నిర్ణయం ప్రకటించి సంచలనం సృష్టిస్తున్నారు.
పీఆర్సీ ఏర్పాటుతో...
తాజాా ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పీఆర్సీని నియమించారు. పే స్కేల్ చెల్లింపుల కోసం పే రివిజన్ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ ను నియమించారు. సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బి. రామయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్టీ బాధ్యతలను నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను, సిబ్బందిని నియమించాలని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఆదేశించారు. ఐదు శాతం మధ్యంతర భృతిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.