బీజేపీకి కేసీఆర్ వార్నింగ్
ఎరువుల ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎరువుల ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్రంగా కేసీఆర్ విమర్శించారు. రైతులు వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు.
దేశ వ్యాప్త ఆందోళన....
వ్యవసాయ ఖర్చులను పెంచుకుంటూ పోతే రైతు ఎలా బతుకుతాడని కేసీఆర్ ప్రశ్నించారు. ఎరువల ధరలు తగ్గించేంత వరకూ తాము పోరాటం చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్త ఆందోళనకు దిగుతామని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. బీజేపీ కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.