Revanth Reddy : కోఠి ఉమెన్స్ కళాశాలలో రేవంత్ సంచలన ప్రకటన
కోఠి ఉమెన్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు;

కోఠి ఉమెన్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తున్నామని తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న కోఠి ఉమెన్స్ కళాశాల పేరును చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. మహిళా యూనివర్సిటీ గా మార్చి దొరలపై పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వర్సిటీగా నామకరణం చేయడం తనకు గర్వంగా ఉందన్నారు. దీంతో పాటు కోఠి మహిళ ఉమెన్స్ కళాశాల అభివృద్ధికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఐదు వందల కోట్ల రూపాయలు...
మహిళలు అన్ని రంగాల్లో ముందంజలోకి రావాలన్నారు. ఈ యూనివర్సిటీని ప్రపంచంలో మేటి వర్సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలని రేవంత్ ఆకాంక్షించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులను క్యాంపస్ లో కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.