Revanth Reddy : పాలమూరులో రేవంత్ రోడ్ షో

మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షోలో పాల్గొన్నారు. పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు

Update: 2024-04-19 07:44 GMT

మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షోలో పాల్గొన్నారు. పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా వంశీ నేడు నామినేషన్ దాఖలు చేయనుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు మహబూబ్ నగర్ లో భారీ ర్యాలీని నిర్వహించారు.

ర్యాలీగా నామినేషన్ కు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తన సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags:    

Similar News