Revanth Reddy : కొత్త ఏడాది మరింతగా వృద్ధి
కొత్త ఏడాది తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు;

కొత్త ఏడాది తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. తాను భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. దేశంలోని కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనాగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అనేక అడ్డంకులు వస్తుంటాయని, వాటిని అధిగమించడానికి తాము ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
దేవుళ్లనే నూటికి నూరుశాతం...
దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటిది మానవ మాత్రులకు ఇలాంటి ఆటంకాలు ఎదురు కాక తప్పదని ఆయన అన్నారు. అసాంఘిక భక్తులపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని నేడు పేదలకు పంచాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించి ఆత్మగౌరవం పెంచేలా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.