Revanth Reddy Challenges KTR: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్.. ఈసారి అంగీవిప్పి కొడతారంటూ?

కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-02-14 07:05 GMT

Revanth Reddy Challenges KTR:కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. బొక్కా బోర్లా పడ్డా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పై చర్చ అంటే ప్రతిపక్ష నేత రాకుండా పారిపోయాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశఆరు. కేసీఆర్ అనే పాము మొన్న ఎన్నికల్లోనే చచ్చిపోయిందన్నారు. గత మూడు రోజుల నుంచి శాసనసభలో కృష్ణా నదీ జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు రాలేదన్నారు. ఈ రైతుల పట్ల గౌరవం ఉంటే బీఆర్ఎస్ మేడిగడ్డకు రావాల్సి ఉందన్నారు. కానీ అక్కడకు రాకుండా నల్లగొండకు వెళ్లి తమ ప్రభుత్వమే తప్పు చేసినట్లు మాట్లాడటం కేసీఆర్ వాడిన భాష మీద చర్చ చేద్దామని తెలిపారు.

ముఖ్యమంత్రిపై ఇలాంటి మాటలా?
ఈసారి ప్యాంటు, అంగీని కూడా విప్పి జనం కొడతారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నల్లగొండ సభలో నానా దుర్భాషలాడటం ఎంత వరకూ కరెక్ట్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా కేటీఆర్‌‌లో మార్పు రాలేదన్నారు. సభలో చర్చకు రమ్మంటే రాకుండా నల్లగొండలో సభ పెట్టుకుని నానా మాటలు అన్నారని అన్నారు. దమ్ముంటే సభకు వచ్చి కాళేశ్వరంపై చర్చించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.


Tags:    

Similar News