Revanth Reddy : బాధితులకు పదివేల సాయం ప్రకటించిన రేవంత్

మున్నేరు ముంపుకు గురైన బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.;

Update: 2024-09-02 13:18 GMT
revanth reddy, chief minister, victims, khammam district
  • whatsapp icon

మున్నేరు ముంపుకు గురైన బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అండగా ఉంటానని భరోసా...
తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం కమాండ్ కంట్రోల్ రూంలో వరద పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన సూర్యాపేటకు చేరుకున్నారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. తర్వాత పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ గూడేనికి చేరుకున్నారు. అక్కడ దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు.


Tags:    

Similar News