ఆరోగ్యశ్రీపై రేవంత్ కీలక నిర్ణయం
ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు లింకు పెట్టొద్దని కలెక్టర్లకు సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ఒక్కరికీ...
ఆర్‌ఎంపీలు, పీఎంపీల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతీ బెడ్‌కు..సీరియల్ నెంబర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. గిరిజనులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల మెయింటెనెన్స్ కోసం..ప్రత్యేక వ్యవస్థ ఉండేలా కలెక్టర్లు చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.