Revanth Reddy : రాష్ట్ర గీతానికి రాజకీయ పార్టీ నేతల ఆమోదం
తెలంగాణ రాష్ట్ర గీతంపై రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర గీతంపై రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్ర గీతానికి అందరూ ఆమోదం తెలిపారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రొఫెసర్ కోదండరామ్ లు హాజరయ్యారు. అయితే కొన్ని మార్పులు జాతీయ గీతంలో సూచించారు.
మార్పులు, చేర్పుల బాధ్యతలు...
మగ్దుం మొహియుద్దీన్ ప్రస్తావన ఉండేలా చూడాలని సీపీఐ నేతలు కోరడంతో దాని బాధ్యతను రచయిత అందెశ్రీకి అప్పగించారు.2.30 నిమిషాలతో ఉన్న ఈ గీతానికి ఆమోదం తెలిపారు. కీరవాణి ఈ సమావేశంలో ఈ గీతాన్ని వినిపించారు. జూన్ 2వ తేదీన ఈ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ చిహ్నం మాత్రం జూన్ రెండో తేదీన ఆవిష‌్కరణ జరగదని తెలిసింది. అందరితో చర్చించిన తర్వాత మాత్రమే తెలంగాణ చిహ్నాన్ని ఖరారు చేయనున్నారు.