Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనం గా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇక వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
సోనియా గాంధీ రాకపై...
పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటిం జెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది. జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భా వ వేడుకలు ప్రారంభం అవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సోనియా గాంధీ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఎండ తీవ్రతల దృష్ట్యా ఆమె వచ్చే అవకాశాలపై ఇంకా స్పష్టతరాలేదు. ఆమె రాకుంటే రాహుల్, ప్రియాంకలనైనా ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.