మూడోరోజుకు చేరిన పాదయాత్ర

ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది

Update: 2022-03-01 08:45 GMT

ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఆయన నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.

ఏ హామీని కూడా.....
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా కేసీఆర్ నెరవేర్చ లేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు హామీలను అమలు పర్చాలని కోరితే అసెంబ్లీని బంద్ చేస్తామని అంటారన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. మద్దతు ధరను అడిగినందుకు రైతులకు బేడీలు వేయడం కూడా మనం చూశామన్నారు. ఈ పాదయాత్ర ఎన్నికల కోసం కాదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమేనని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.


Tags:    

Similar News